Share News

రూపాయి కోసం ఫారెక్స్‌ నిల్వలను త్యాగం చేయొద్దు..

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:56 AM

రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చు చేయడాన్ని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యతిరేకించారు.

రూపాయి కోసం ఫారెక్స్‌ నిల్వలను త్యాగం చేయొద్దు..
rajan

  • చమురు సెగే కరెన్సీకి అతిపెద్ద సమస్య

  • ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘరామ్‌ రాజన్‌

ముంబై: రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చు చేయడాన్ని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యతిరేకించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి పతనంపై గాబరా పడాల్సిన అవసరం లేదన్నారు. రూపాయి మారకం విలువ తగ్గుదలతో ఎగుమతుల ఆదాయం పుంజుకోనుందన్నారు. ఓ సదస్సులో మాట్లాడుతూ రాజన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు డాలర్‌తో రూపాయి మారకం రేటు ఆరు శాతం వరకు క్షీణించింది. ఆసియాలో మరే దేశ కరెన్సీ ఇంతగా పడిపోలేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో రూపాయి మరింత క్షీణించవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. భారత్‌ సహా వర్ధమాన దేశాలన్నిటికీ చమురు ధర పెరుగుదలే అతి పెద్ద సమస్య అని రాజన్‌ స్పష్టం చేశారు.

Updated Date - Oct 28 , 2026 | 06:56 AM