Share News

యూఎస్‌ ఫెడ్‌ టాస్క్‌ఫోర్స్‌లో రాజన్‌

ABN , Publish Date - Jul 12 , 2026 | 03:41 AM

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌.. ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రస్తుతం అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానాన్ని సమూలంగా మార్చాలనుకుంటోంది. ఇందుకు...

యూఎస్‌ ఫెడ్‌ టాస్క్‌ఫోర్స్‌లో రాజన్‌

  • రాజ్‌ చెట్టి, ఆశా శర్మకు సైతం చోటు

న్యూయార్క్‌: అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌.. ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రస్తుతం అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానాన్ని సమూలంగా మార్చాలనుకుంటోంది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను చేసేందుకు 5 టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. ఆ టాస్క్‌ఫోర్స్‌ల సభ్యుల పేర్లను ఫెడ్‌ రిజర్వ్‌ కొత్త చైర్మన్‌ కెవిన్‌ వార్ష్‌ ప్రకటించారు. అందులో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌తో పాటు హార్వర్డ్‌ యూనివర్సిటీ ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌ రాజ్‌ చెట్టి, మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌బాక్స్‌ విభాగ సీఈఓ ఆశా శర్మ కూడా ఉన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌సలో ఫైనాన్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాజన్‌.. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాలెన్స్‌ షీట్‌ పాలసీకి సంబంధించిన టాస్క్‌ఫోర్స్‌కు సహ నేతృత్వం వహించనున్నారు. కాగా, ద్రవ్య లభ్యతపై ఆధారానికి సంబంధించిన ప్యానెల్‌లో రాజ్‌ చెట్టికి చోటు దక్కింది. ప్రొడక్టివిటీ అండ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ కమిటీలోకి ఆశా శర్మ ఎంపికయ్యారు. ఐదు టాస్క్‌ఫోర్స్‌ల కోసం ఫెడ్‌ చైర్మన్‌ కెవిన్‌ వార్ష్‌ మొత్తం 15 మందిని ఎంపిక చేయగా.. అందులో ముగ్గురు భారతీయులే కావడం విశేషం.

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ బులెట్ ట్రైన్స్ హబ్‌గా మారబోతోంది: అశ్వినీ వైష్ణవ్

ఐదు గనులకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

Updated Date - Jul 12 , 2026 | 03:42 AM