Share News

పల్స్‌ ఫార్మా.. నానో విటమిన్‌ డీ3కి డీసీజీఏ అనుమతి

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:07 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న పల్స్‌ ఫార్మాస్యూటికల్స్‌.. నానో-క్యారియర్‌ ఎన్‌ట్రా్‌ప్డ విటమిన్‌ డీ3 ఓరల్‌ ఔషధానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి..

 పల్స్‌ ఫార్మా.. నానో విటమిన్‌ డీ3కి డీసీజీఏ అనుమతి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న పల్స్‌ ఫార్మాస్యూటికల్స్‌.. నానో-క్యారియర్‌ ఎన్‌ట్రా్‌ప్డ విటమిన్‌ డీ3 ఓరల్‌ ఔషధానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి లభించిందని వెల్లడించింది. గురువారం నాడిక్కడ కంపెనీ వ్యవస్థాపకుడు, ఎండీ కేవీ రాంబాబు మాట్లాడుతూ.. కఠినమైన శాస్త్రీయ పరీక్షల అనంతరం నియంత్రణ సంస్థ ఈ అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. నానో టెక్నాలజీతో కూడిన విటమిన్‌ డీ3 ఔషధానికి ఈ తరహా అనుమతి లభించటం ప్రపంచంలో ఇది తొలిసారని ఆయన చెప్పారు. కాగా ఈ అనుమతితో ఇప్పటి వరకు పరిశోధన స్థాయిలో ఉన్న ఈ ఔషధం పూర్తి స్థాయి ఉత్పత్తిగా మార్కెట్లో అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. నానో క్యారియర్‌ ఎన్‌ట్రా్‌ప్డ విటమిన్‌ డీ3 ఓరల్‌ ఔషధంతో సెరమ్‌ విటమిన్‌ డీ3 స్థాయిలు 50-60 శాతం పెరిగినట్లు క్లినికల్‌ పరీక్షల్లో వెల్లడైందని తెలిపారు. 2010 నుంచి ఈ ఔషధంపై పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నామని, కంపెనీ ప్రొప్రైటరీ ప్లాట్‌ఫామ్‌ టెక్నాలజీ అయిన అక్వీల్‌పై దీన్ని ప్రత్యేకంగా తయారు చేసినట్లు రాంబాబు తెలిపారు. ఈ టెక్నాలజీతో ప్రస్తుతం ఈ ఔషధాన్ని దిగ్గజ ఫార్మా సంస్థలైన అబ్బాట్‌, సనోఫీలకు తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే విటమిన్‌ కే2-7, బీ12, ఐరన్‌ ఔషధాలకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తు తం కంపెనీ రూర్కీతో పాటు బద్దీ, హైదరాబాద్‌ల్లో ప్లాంట్లను నిర్వహిస్తోందని చెప్పారు. కాగా రూ.150 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌ జినోమ్‌ వ్యా లీలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాంబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 06:07 AM