అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు మేడిన్ ఇండియా చిప్‌లు కీలకం
ABN , Publish Date - Feb 22 , 2026 | 03:37 AM
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంతోపాటు స్వయం సమృద్ధి సాధించేందుకు ‘మేడిన్ ఇండియా’ చిప్ (సెమీకండక్టర)లు కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశీయ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఫాక్స్‌కాన్-హెచ్‌సీఎల్ చిప్ ప్లాంట్‌కు శంకుస్థాపన
గ్రేటర్ నోయిడా: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంతోపాటు స్వయం సమృద్ధి సాధించేందుకు ‘మేడిన్ ఇండియా’ చిప్ (సెమీకండక్టర)లు కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశీయ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ గ్రూప్ సంయుక్త భాగస్వామ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని జేవర్‌లో ఏర్పాటు చేస్తున్న చిప్‌ల తయారీ ప్లాంట్‌కు ప్రధాని శనివారం శంకుస్థాపన చేశారు. దృశ్య మాధ్యమ విధానంలో సాగిన ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. కొవిడ్ సంక్షోభ సమయంలో చిప్‌ల సరఫరాకు అంతరాయం కలగడంతో పలు ఆర్థిక వ్యవస్థల పురోగతి స్తంభించిపోయింది. చాలా ఫ్యాక్టరీల్లో పని నిలిచిపోయిందన్నారు. ‘‘భారత్ స్వయం సమృద్ధి సాధించగలిగితేనే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించగలదు. అందుకు మేడిన్ ఇండియా చిప్‌లు చాలా ముఖ్యం. ఈ దశాబ్దంలో భారత్ సాంకేతిక రంగంలో పురోగతికి చేస్తున్న కృషి, 21వ శతాబ్దంలో మన సామర్థ్యానికి పునాది కానుంద’’ని ఆయన పేర్కొన్నారు.
రూ.3,700 కోట్ల పెట్టుబడులు: హెచ్‌సీఎల్ గ్రూప్, ఫాక్స్‌కాన్ 60:40 నిష్పత్తి భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన సంస్థ ‘ది ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్’ ఈ చిప్‌ల తయారీ ప్లాంట్‌ను రూ.3,700 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తోంది. నెలకు 20,000 చిప్‌ల తయారు చేయగలిగే ఈ ప్లాంట్‌లో 2028 నుంచి ఉత్పత్తి ప్రారంభం కావచ్చని అంచనా. ఈ ప్లాంట్ 3,500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనుంది.
ఇవీ చదవండి:
'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'
ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్