Share News

పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.549 కోట్ల ఆర్డర్‌

ABN , Publish Date - Sep 30 , 2026 | 02:21 AM

హైదరాబాద్‌కు చెందిన మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థ పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌.. అదానీ గ్రూప్‌నకు చెందిన మోక్సీ పవర్‌ జెనరేషన్‌ నుంచి రూ.549.37 కోట్ల విలువైన ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు ప్రకటించింది

పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌కు   రూ.549 కోట్ల ఆర్డర్‌
POWER MAKE PROJECT LOGO

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థ పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌.. అదానీ గ్రూప్‌నకు చెందిన మోక్సీ పవర్‌ జెనరేషన్‌ నుంచి రూ.549.37 కోట్ల విలువైన ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్డర్‌లో భాగంగా ట్యుటికోరిన్‌లో ఒక్కొక్కటి 600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు థర్మల్‌ ప్లాంట్లకు పూర్తి స్థాయి ఆపరేషన్‌, నిర్వహణ సేవలు అందించాల్సి ఉంటుందని పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌ తెలిపింది. అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ కాంట్రాక్టు కాలపరిమితి 60 నెలలుగా ఉందని పేర్కొంది.

Updated Date - Sep 30 , 2026 | 02:21 AM