సరికొత్త శిఖరాలకు వాహన విక్రయాలు
ABN , Publish Date - Apr 02 , 2026 | 06:06 AM
మార్చి 31వ తేదీతో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహన కంపెనీల దేశీయ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 8% వృద్ధితో సరికొత్త రికార్డు స్థాయి 47 లక్షల యూనిట్లకు...
2025-26లో 47 లక్షల యూనిట్లకు చేరిక
జీఎ్‌సటీ తగ్గింపుతో ఊపందుకున్న సేల్స్
న్యూఢిల్లీ: మార్చి 31వ తేదీతో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహన కంపెనీల దేశీయ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 8% వృద్ధితో సరికొత్త రికార్డు స్థాయి 47 లక్షల యూనిట్లకు పెరిగాయి. గత సెప్టెంబరులో కేంద్రం కార్లపై జీఎ్‌సటీని గణనీయంగా తగ్గించడంతో మారుతి సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి దేశీయ కంపెనీల సేల్స్ జోరందుకోవడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. మార్కెట్ అగ్రగామి మారుతి సుజుకీ గత ఆర్థిక సంవత్సరంలో 24,22,713 యూనిట్ల విక్రయాలు జరిపింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికం.
కొత్త ఆర్థిక సంవత్సరంపై ఆశావహం: బుధవారం నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ (2026-27) విక్రయాల్లో అదే జోరును కొనసాగించాలని కంపెనీలు చూస్తున్నాయి. అయితే, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సరఫరా వ్యవస్థలో అంతరాయాలతోపాటు కమోడిటీ ధరల పెరుగుదలతో కంపెనీలు వాహన ధరలు పెంచడం గిరాకీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
త్వరలో మారుతి కార్ల ధరల పెంపు!: గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా జీఎ్‌సటీ తగ్గింపుతో ద్వితీయార్ధంలో డిమాండ్ ఒక్కసారిగా పుంజుకుందని, దాంతో పరిశ్రమ మొత్తం విక్రయాలు 47 లక్షల యూనిట్లకు పెరిగాయని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ అన్నారు. 2024-25లో పరిశ్రమ విక్రయాలు 43.4 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఆదాయం పన్ను రిబేటు, ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపు, జీఎస్‌టీ కోత వంటి అంశాలు వాహన విక్రయాలకు చోదకంగా పనిచేయనున్నప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధంతో వాహన పరిశ్రమకు అవసరమైన కమోడిటీల ధరలు గణనీయంగా పెరిగాయి. దాంతో కంపెనీలు వాహన ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని, ఇది వాహనాల, ముఖ్యంగా చిన్న కార్ల గిరాకీపై ప్రభావం చూపే అవకాశం ఉందని బెనర్జీ పేర్కొన్నారు. మారుతి సుజుకీ కూడా త్వరలోనే కార్ల ధరలను పెంచనుందని ఆయన సంకేతాలిచ్చారు.
2025-26 విక్రయాలు
కంపెనీ యూనిట్లు వృద్ధి
(లక్షలు) (%)
మారుతి సుజుకీ 24.22 --
మహీంద్రా అండ్ మహీంద్రా 6.6 20
టాటా మోటార్స్ 6.4 15
టయోటా కిర్లోస్కర్ 4.06 20
ఇవి కూడా చదవండి...
అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత
మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్
Read Latest AP News And Telugu News