Share News

విస్తరణ బాటలో ప్యారడైజ్‌ బిర్యానీ

ABN , Publish Date - Apr 28 , 2026 | 06:07 AM

ప్యారడైజ్‌ బిర్యానీ మరిన్ని నగరాలకు తన బిర్యానీ రుచులను అందించాలని నిర్ణయించింది. కీలకమైన నగరాలకు విస్తరించడంతో పాటు తన ఉనికిని...

విస్తరణ బాటలో ప్యారడైజ్‌ బిర్యానీ

రూ.100 కోట్ల సమీకరణకు సన్నాహాలు

ముంబై: ప్యారడైజ్‌ బిర్యానీ మరిన్ని నగరాలకు తన బిర్యానీ రుచులను అందించాలని నిర్ణయించింది. కీలకమైన నగరాలకు విస్తరించడంతో పాటు తన ఉనికిని మరింత పటిష్టం చేసుకునేందుకు దాదాపు రూ.100 కోట్ల నిధులను సమీకరించాలనుకుంటోంది. ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్టులను నిర్వహిస్తున్న ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ సమరా క్యాపిటల్‌.. విస్తరణకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు పలు భార త కుటుంబాల కార్యాలయాలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10-12 శాతం వాటా ను కొత్త ఇన్వెస్టర్‌కు విక్రయించాలనుకుంటున్నట్టు సమాచారం. తాజాగా సేకరించనున్న నిధులతో వచ్చే మూడేళ్లలో 100 కొత్త ప్యారడైజ్‌ ఔట్‌లెట్లను ప్రారంభించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, గురుగ్రామ్‌లలో దాదాపు 57 ఔట్‌లెట్లను ప్యారడైజ్‌ నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఆంధ్ర నెట్‌ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం

Updated Date - Apr 28 , 2026 | 06:07 AM