Share News

ఓయో రూ.6,650 కోట్ల ఐపీఓ

ABN , Publish Date - Jul 01 , 2026 | 06:21 AM

బడ్జెట్‌ హోటళ్ల బ్రాండ్‌ ‘ఓయో’ మాతృ సంస్థ ప్రిజమ్‌.. తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ద్వారా రూ.6,650 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపింది. పూర్తిగా తాజా ఈక్విటీ జారీ ద్వారా ఈ నిధులను...

ఓయో రూ.6,650 కోట్ల ఐపీఓ

న్యూఢిల్లీ: బడ్జెట్‌ హోటళ్ల బ్రాండ్‌ ‘ఓయో’ మాతృ సంస్థ ప్రిజమ్‌.. తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ద్వారా రూ.6,650 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపింది. పూర్తిగా తాజా ఈక్విటీ జారీ ద్వారా ఈ నిధులను సేకరించనున్నట్లు సెబీకి మంగళవారం సమర్పించిన అప్‌డేటెడ్‌ ఐపీఓ పత్రాల్లో వెల్లడించింది. కాగా, సంస్థ వ్యవస్థాపకుడు రితేశ్‌ అగర్వాల్‌, అతిపెద్ద పెట్టుబడిదారైన సాఫ్ట్‌బ్యాంక్‌తో పాటు ఇతర ఇన్వెస్టర్లు ఎవరూ ఈ ఐపీఓ ద్వారా తమ వాటాలను విక్రయించడం లేదు. మరిన్ని వివరాలు..

  • ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.1,330 కోట్ల వరకు నిధులు సమీకరించే ఆలోచన కూడా ఉందని ప్రిజమ్‌ తెలిపింది.

  • ప్రిజమ్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌ మొత్తం 40.04 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. అగర్వాల్‌ మొత్తం వాటా 30.52 శాతంగా ఉంది. వీరిద్దరి వాటాయే 70.56 శాతం. ఇతర ఇన్వెస్టర్లైన మైక్రోసాఫ్ట్‌, ఎయిర్‌బీఎన్‌బీ, ఖజానా, పీక్‌ ఎక్స్‌వీ, లైట్‌స్పీడ్‌ ఇతరులు మిగతా వాటాను కలిగి ఉన్నారు.

  • ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.4,987.5 కోట్లను రుణాల తిరిగి చెల్లింపులకు ఉపయోగించుకోనున్నట్లు సంస్థ తెలిపింది. కంపెనీ నికర రుణ భారం రూ.6,828 కోట్లుగా ఉంది.

రెండో రోజూ నష్టాల్లో మార్కెట్లు

ఐటీ, ఆయిల్‌, గ్యాస్‌తో పాటు బ్యాంకింగ్‌ రంగానికి చెందిన కొన్ని షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్‌ 249.70 పాయింట్లు కోల్పోయి 76,478.67 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 80.50 పాయింట్లు తగ్గి 23,865.75 వద్ద ముగిసింది

ఇవి కూడా చదవండి..

రెండో రోజూ నష్టాలే.. 170 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..

ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..

Updated Date - Jul 01 , 2026 | 06:21 AM