Share News

ఒప్పో నుంచి రెనో 16 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:18 AM

యువ వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన రెనో 16 సిరీస్‌...

ఒప్పో నుంచి రెనో 16 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): యువ వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన రెనో 16 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ఒప్పో ఇండియా బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో రెనో 16, రెనో 16సీ ఫోన్లను తెచ్చింది. వీటిలో ఏఐ పోట్రెయిట్‌ కెమెరా, ఏఐ రీమిక్స్‌ కొలేజ్‌తోపాటు పలు ఏఐ ఫీచర్లను అందిస్తోంది. రెనో 16లో స్నాప్‌డ్రాగన్‌ 7జెన్‌ 4 ప్రాసెసర్‌, వెనుకవైపు 50ఎంపీ మెయిన్‌ కెమెరా, 50 ఎంపీ టెలీఫొటో పోట్రెయిట్‌ కెమెరా, 50 ఎంపీ అల్ర్టా వైడ్‌ కెమెరా, ముందు 50 ఎంపీ అల్ర్టావైడ్‌ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రెనో 16సీలో వెనుకవైపు 50 ఎంపీ మెయిన్‌, 50 ఎంపీ టెలీఫొటో పోట్రెయిట్‌, 8ఎంపీ అల్ర్టావైడ్‌ కెమెరా ఉండగా.. ముందువైపు 50ఎంపీ అల్ర్టావైడ్‌ సెల్ఫీ కెమెరా ఉంది. 2 వేరియంట్లలో లభించే రెనో16 5జీ ధర శ్రేణి రూ.61,999 నుంచి రూ.67,999గా ఉంది. మూడు వేరియంట్ల రెనో 16సీ 5జీ ధరల శ్రేణి రూ.46,999 నుంచి రూ.55,999 వరకు ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి

ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్‌..!

Updated Date - Jul 09 , 2026 | 04:18 AM