Share News

టీజీఎస్ఆర్‌టీసీ నుంచి ఓలెక్ట్రాకు భారీ ఆర్డర్‌

ABN , Publish Date - Feb 24 , 2026 | 06:06 AM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌ (టీజీఎస్ఆర్‌టీసీ) నుంచి ఎలక్ట్రిక్‌ బస్పుల సరఫరా కోసం భారీ ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ వెల్లడించింది...

టీజీఎస్ఆర్‌టీసీ నుంచి ఓలెక్ట్రాకు భారీ ఆర్డర్‌

1,085 ఎలక్ట్రిక్‌ బస్సుల సరఫరాకు ఎల్‌ఓఐ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌ (టీజీఎస్ఆర్‌టీసీ) నుంచి ఎలక్ట్రిక్‌ బస్పుల సరఫరా కోసం భారీ ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. పీఎం ఈ-డ్రైవ్‌ కింద అనుబంధ సంస్థ అయిన ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1,085 ఎలక్ట్రిక్‌ బస్సుల సరఫరా కాంట్రాక్ట్‌ను గెలుచుకుందని తెలిపింది. ఈ మేరకు టీజీఎ్‌సఆర్‌టీసీ నుంచి లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ)ను అందుకున్నట్లు తెలిపింది. కాగా ఈ బస్సులను పూర్తిగా హైదరాబాద్‌లోనే వినియోగించనున్నట్లు ఒలెకా్ట్ర పేర్కొంది. పీఎం ఈ-డ్రైవ్‌ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ ఆర్డర్‌ ఎంతగానో దోహదపడటమే కాకుండా మేకిన్‌ ఇండియా విజన్‌ లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నామనేందుకు ఇది నిదర్శనం గా ఉండనుందని ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ ఎండీ మహేశ్‌ బాబు తెలిపారు. ఆర్డర్‌లో భాగంగా భారతీయ రహదారులకు అనుగుణంగా ఉండే 12 మీటర్ల లో-ఫ్లోర్‌ ఏసీ, నాన్‌ ఏసీ బస్సులను వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఒకసారి చార్జింగ్‌తో ఈ బస్సులు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని వెల్లడించింది.

ఇవీ చదవండి:

భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్టు

రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్

Updated Date - Feb 24 , 2026 | 06:39 AM