ఓలెక్ట్రా లాభం రూ.52 కోట్లు
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:15 AM
ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్టెక్.. సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.52.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...
త్వరలో కొత్త తరం ఎలక్ట్రిక్ బస్సులు విడుదల
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్టెక్.. సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.52.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం లాభం రూ.49.43 కోట్లతో పోల్చితే 5.4 శాతం వృద్ధి చెందిం ది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ.656.62 కోట్ల నుంచి రూ.687.01 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు 6.5 శాతం పెరిగి రూ.632.39 కోట్లకు చేరుకున్నాయి. సెప్టెంబరు ముగిసే నాటికి కంపెనీ ఆర్డర్ బుక్ 8,000 ఎలక్ట్రిక్ బస్సులుగా ఉందని ఓలెక్ట్రా గ్రీన్టెక్ ఎండీ మహేశ్ బాబు తెలిపారు. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ 401 బస్సులను డెలివరీ చేసిందని తెలిపారు. కాగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం కంపెనీ ప్రత్యేకంగా కొత్త తరం ఎలక్ట్రిక్ బస్సులను అభివృద్ధి చేసిందన్నారు. కంపెనీ దేశీయంగా వీటిని తయారు చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్స రం మార్చి త్రైమాసికంలో వీటిని మార్కెట్లోకి విడుదల చేయాలని చూస్తున్నట్లు మహేశ్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
దీపావళి బాణసంచా ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు