ఎన్‌విడియా షేరు ఢమాల్
ABN , Publish Date - Nov 10 , 2026 | 04:59 AM
అమెరికా స్టాక్ మార్కెట్లో చిప్ తయారీ కంపెనీ ఎన్‌విడియా షేరు సోమవారం భారీగా నష్టపోయింది. ప్రీ మార్కెట్ ఓపెనింగ్‌లో...
2 రోజుల్లో రూ.44 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ హాంఫట్
న్యూయార్క్: అమెరికా స్టాక్ మార్కెట్లో చిప్ తయారీ కంపెనీ ఎన్‌విడియా షేరు సోమవారం భారీగా నష్టపోయింది. ప్రీ మార్కెట్ ఓపెనింగ్‌లో ఒక దశలో 8 శాతం నష్టపోయింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11.45 గంటలకు నాస్‌డాక్‌లో 5.20 శాతం నష్టంతో 176.96 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో గత నెల 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఎన్‌విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.5 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.140 లక్షల కోట్లు) తుడిచి పెట్టుకుపోయింది. ఇందులో గత రెండు రోజుల్లోనే 47,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.44.07 లక్షల కోట్లు) మార్కెట్ క్యాప్ మంచులా కరిగిపోయింది. ఎన్‌విడియా చీఫ్ జెన్‌సెన్ హుయాంగ్‌కు ఒక చైనా గూఢచారిణితో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావటమే ఇందుకు ప్రధాన కారణం.
ఈ వార్తలు కూడా చదవండి
దీపావళి బాణసంచా ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు