Share News

ఎన్‌విడియా సంక్షోభం.. మన స్టార్టప్స్ కూ దెబ్బే!

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:19 AM

అంతర్జాతీయ చిప్‌ దిగ్గజం ఎన్‌విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ తొలగింపు ప్రభావం భారత్‌పై పడే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు

ఎన్‌విడియా సంక్షోభం..  మన స్టార్టప్స్ కూ  దెబ్బే!
startup

ముంబై: అంతర్జాతీయ చిప్‌ దిగ్గజం ఎన్‌విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ తొలగింపు ప్రభావం భారత్‌పై పడే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికిపుడు పెద్దగా ప్రభావం లేకపోయినా మూడు లేదా నాలుగేళ్ల తర్వాత ఈ ప్రభావం ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. ముఖ్యంగా కృత్రి మ మేధ (ఏఐ) రంగంలో ఉన్న భారతీయ స్టార్టప్స్‌ పెట్టుబడులు, సాంకేతిక మద్దతు, కలిసి పని చేయడం వంటి విషయాల్లో ఈ ప్రభావం ఉంటుందని వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ పేవ్‌స్టోన్‌ క్యాపిటల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ చెప్పారు. ఎన్‌విడియా ప్రస్తుతం భారత్‌లోని అనేక కీలక ఏఐ కంపెనీల ప్రాజెక్టులకు గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల (జీపీయూ)ను సరఫరా చేస్తోంది. మరోవైపు హువాంగ్‌పై గూఢచర్యం ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో అమెరికా ఈ అధునాతన చిప్‌లను భారత ఏఐ కంపెనీలకు సరఫరా చేయడంపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యం లో అధునాతన జీపీయూల కోసం ఒకే కంపెనీపై ఆధారపడడం ఇప్పటికైనా తగ్గించుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Nov 14 , 2026 | 02:25 AM