Share News

ఎన్‌ఎస్‌ఈ నుంచి ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌!

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:37 AM

మన దేశంలోనూ ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ (ఈజీఆర్‌) అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ఈ దిశగా ఆలోచిస్తోందని చైర్మన్‌ ఇంజేటి శ్రీనివాస్‌...

ఎన్‌ఎస్‌ఈ నుంచి ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌!

మన దేశంలోనూ ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ (ఈజీఆర్‌) అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ఈ దిశగా ఆలోచిస్తోందని చైర్మన్‌ ఇంజేటి శ్రీనివాస్‌ వెల్లడించారు. ఈ ప్రతిపాదన ఆచరణకు నోచుకుంటే మన దేశంలో ప్రజల వద్ద మూలుగుతున్న దాదాపు 35,000 టన్నుల బంగారానికి ఆర్థిక విలువ ఏర్పడుతుంది. దాంతో మన దేశ వార్షిక పసిడి దిగుమతులూ 50 శాతం పడిపోతాయని అంచనా. ఈ ఎలకా్ట్రనిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ను షేర్లలో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో అప్పటి మార్కెట్‌ ధర ప్రకారం క్రయవిక్రయాలు చేయవచ్చు. ఒకవేళ ఇవేమీ వద్దను కుంటే స్వచ్ఛమైన బంగారం రూపంలో వెనక్కి తీసుకోవచ్చు.

ఈ ప్రతిపాదన ఆచరణకు నోచుకుంటే మరో పెట్టుబడి సాధనం దేశీయ మదుపరులకు అందుబాటులోకి వస్తుంది. పసిడి దిగుమతులకూ చెక్‌ పడుతుంది. కాగా ఈజీఆర్‌ ప్రొడక్ట్‌ను డెవలప్‌ చేయటంతో పాటు డిజిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌ను పటిష్ఠం చేసేందుకు గాను ఆగ్మెంట్‌ గోల్డ్‌ టెక్‌తో ఎన్‌ఎస్‌ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

  • అమెజాన్‌ నౌ.. తన క్విక్‌ డెలివరీ సేవలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మరింతగా విస్తరించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఈ సేవలు అందుబాటులో ఉండగా తాజాగా తెలంగాణలోని సంగారెడ్డి, నిజామాబాద్‌, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌లతో పాటు ఏపీలోని నెల్లూరు, తిరుపతి, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, కడపలకు విస్తరించింది.

  • అంతర్జాతీయ లాజిస్టిక్స్‌ సేవల సంస్థ డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌.. భారత్‌లో తమ షిప్‌మెంట్‌ చార్జీలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 8.9 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్‌ఫుట్‌ ఖర్చులు, కరెన్సీ మారకంలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని డీహెచ్‌ఎల్‌ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 27 , 2026 | 01:39 AM