Share News

టాటా సన్స్‌ లిస్టింగ్‌తో దాతృత్వ కార్యక్రమాలకు ఇబ్బందే..

ABN , Publish Date - Nov 15 , 2026 | 04:15 AM

టాటా సన్స్‌ లిస్టింగ్‌ ప్రతిపాదనపై టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌ నోయల్‌ టాటా ఆందోళన వ్యక్తం చేశారు. టాటా సన్స్‌ లిస్టింగ్‌తో...

టాటా సన్స్‌ లిస్టింగ్‌తో దాతృత్వ కార్యక్రమాలకు ఇబ్బందే..

గ్రూప్‌ వ్యాపార గతినే మార్చేస్తుంది 8 వాటాదారుల్లో లాభాపేక్ష పెరగవచ్చు

8 టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌ నోయల్‌ టాటా

ముంబై: టాటా సన్స్‌ లిస్టింగ్‌ ప్రతిపాదనపై టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌ నోయల్‌ టాటా ఆందోళన వ్యక్తం చేశారు. టాటా సన్స్‌ లిస్టింగ్‌తో టాటా గ్రూప్‌ వ్యాపార మూల సిద్ధాంతం మారిపోవచ్చని, వాటాదారులు దాతృత్వం కంటే లాభాలకు ప్రాధాన్యమిచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. గ్రూప్‌ ప్రధాన ఉద్దేశాన్ని పరిరక్షించేందుకు నియంత్రణ సంస్థలు, ఇతర సంబంధిత వర్గాలతో కలిసి ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. శనివారం హెచ్‌టీ లీడర్‌షిప్‌ సమ్మిట్‌ 2026లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టాటా సన్స్‌ బోర్డు- టాటా ట్రస్ట్‌ల మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో నోయల్‌ టాటా తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కంపెనీని స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయాలని తీర్మానించిన టాటా సన్స్‌ బోర్డు.. చైర్మన్‌గా ఎన్‌ చంద్రశేఖరన్‌ పునర్నియమించింది. ఈ రెండు నిర్ణయాలను టాటా ట్రస్ట్‌లు, దాని చైర్మన్‌ నోయల్‌ టాటా తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ వార్తలనూ చదవండి:

జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్

ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..

Updated Date - Nov 15 , 2026 | 04:16 AM