Share News

ఎన్‌ఎండీసీ, వేల్‌ ఎస్‌ఏతో అదానీ గంగవరం పోర్ట్‌ ఒప్పందం

ABN , Publish Date - Feb 22 , 2026 | 03:35 AM

ప్రభుత్వ రంగానికి చెందిన ఎన్‌ఎండీసీ, బ్రెజిల్‌ కంపెనీ వేల్‌ ఎస్‌ఏతో అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీసెజ్‌) లిమిటెడ్‌ అనుబంధ విభాగమైన...

ఎన్‌ఎండీసీ, వేల్‌ ఎస్‌ఏతో అదానీ గంగవరం పోర్ట్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రభుత్వ రంగానికి చెందిన ఎన్‌ఎండీసీ, బ్రెజిల్‌ కంపెనీ వేల్‌ ఎస్‌ఏతో అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీసెజ్‌) లిమిటెడ్‌ అనుబంధ విభాగమైన అదానీ గంగవరం పోర్ట్‌ లిమిటెడ్‌ (ఏజీపీఎల్‌) వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఢిల్లీలో శనివారం జరిగిన ఇండియా-బ్రెజిల్‌ బిజినెస్‌ ఫోరమ్‌ సమ్మిట్‌లో బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డా సిల్వా, భారత వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మూడు సంస్థలు కలిసి ఆంరఽధప్రదేశ్‌లోని గంగవరం పోర్టులో ముడి ఇనుము (ఐరన్‌ ఓర్‌) బ్లెండింగ్‌ యూనిట్‌తో పాటు ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెజ్‌ను ఏర్పాటు చేయనున్నాయి.

ఇవీ చదవండి:

'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'

ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్

Updated Date - Feb 22 , 2026 | 03:35 AM