క్యాడ్‌కు యుద్ధం పోటు
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:48 AM
పశ్చిమాసియాలో భౌగోళిక, రాజకీయ సంక్షోభం కారణంగా కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) పెరిగే ప్రమాదం ఉన్నదని, అది మన దేశ స్థూల వాణి జ్య, ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బ తీయవచ్చునని...
నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక, రాజకీయ సంక్షోభం కారణంగా కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) పెరిగే ప్రమాదం ఉన్నదని, అది మన దేశ స్థూల వాణి జ్య, ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బ తీయవచ్చునని నీతి ఆయోగ్ తాజా నివేదికలో తెలిపింది. ప్రధానంగా మారకం రేటుపై ఒత్తిడి పెరగవచ్చునని పేర్కొంది. ‘‘అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి ట్రేడ్‌వాచ్’’ పేరిట ఒక నివేదికను నీతి ఆయోగ్ సోమవారం విడుదల చేసింది. ఈ అస్థిరత కారణంగా భారత-గల్ఫ్ సమన్వయ మండలి (జీసీసీ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కూడా జాప్యం కావడంతో మనకి కొత్త మార్కెట్ల లభ్యత తగ్గవచ్చునని కూడా హెచ్చరించింది. ఎఫ్‌టీఏ అంటే వన్-వే రోడ్డు కాదని, వాటిని మార్కెట్ విస్తరణకు ఒక సాధనంగా మనం చూస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ అన్నారు. మన వాణిజ్యం అత్యంత కష్టకాలాన్ని కూడా తట్టుకుని పటిష్ఠంగా నిలబడిందన్న విషయం గుర్తు చేస్తూ సేవల విభాగం సైతం అదే బలంతో నిలబడిందన్నారు. వాణి జ్య ఆర్థికవేత్తల ఉద్దేశంలో ఎగుమతుల కన్నా దిగుమతులే కీలకమని ఆయన పేర్కొన్నారు. గత 20 సంవత్సరాల కాలంలో భారత్ 6ు సగటు వృద్ధి సాధించడం స్థూల ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనమని నీతి ఆయోగ్ వీసీ అన్నారు. 2026 ఏప్రిల్-డిసెంబరు త్రైమాసికంలో భారత వాణిజ్య, సర్వీసుల వ్యాపారం నిలకడ వృద్ధిని సాధించిందని, ముందు ఏడాదితో పోల్చితే 5.3ు వృద్ధితో 1.37 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని ఆ నివేదిక పేర్కొంది. ఈ వృద్ధికి ఎఫ్‌టీఏ భాగస్వాములు కీలక చోదక శక్తిగా నిలిచారని తెలిపింది. వాణిజ్య ఒప్పందాల కింద లోతైన ఆర్థిక అనుసంధానతలు, మార్కెట్ల విస్తరణ జరిగిందనేందుకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించింది. వజ్రాభరణాల వ్యాపారంలో కూడా భారత్ ప్రధాన ప్రపంచ శక్తిగా మారిందని తెలిపింది.
Also Read:
ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
For More Latest News