Share News

అత్యంత శక్తిమంతమైన మహిళ నీతా అంబానీ

ABN , Publish Date - Jul 12 , 2026 | 03:43 AM

ఈ ఏడాదికి గాను భారత్‌లోని అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాను ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ విడుదల చేసింది. ఈసారి జాబితాలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌...

అత్యంత శక్తిమంతమైన మహిళ నీతా అంబానీ

  • రోష్నీ నాడార్‌కు రెండో స్థానం..మూడో స్థానంలో ‘అపోలో’ సిస్టర్స్‌

  • సుచిత్ర ఎల్లాకు 26, మహిమ దాట్లకు 88వ స్థానం

  • 2026 జాబితా విడుదల చేసిన ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌

న్యూఢిల్లీ: ఈ ఏడాదికి గాను భారత్‌లోని అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాను ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ విడుదల చేసింది. ఈసారి జాబితాలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. 2020 నుంచి ఇప్పటివరకు నీతా అంబానీకి నం.1 స్థానం దక్కడం ఇది మూడోసారి. 2025, 2024లో ఆమె రెండో స్థానంలో ఉన్నారు. కాగా, హెచ్‌సీఎల్‌ టెక్‌ చైర్‌పర్సన్‌ రోష్నీ నాడార్‌ మల్హోత్రాకు ఈ ఏడాది రెండో స్థానం దక్కింది. గత ఏడాదితో పోలిస్తే ఆమె రెండు స్థానాలు ఎగబాకారు. అపోలో హాస్పిటల్స్‌ నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న సోదరీమణులు శోభన కామినేని, సంగీతా రెడ్డి, ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి వరుసగా రెండో ఏడాదీ మూడో స్థానంలో నిలిచారు. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్లా 26వ స్థానంలో, బయోలాజికల్‌-ఈ ఎండీ మహిమా దాట్ల 88వ స్థానంలో ఉన్నారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌, ఎండీ నారా భువనేశ్వరితో పాటు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రహ్మణి 92వ స్థానంలో నిలిచారు.

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ బులెట్ ట్రైన్స్ హబ్‌గా మారబోతోంది: అశ్వినీ వైష్ణవ్

ఐదు గనులకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

Updated Date - Jul 12 , 2026 | 03:43 AM