గోల్డ్‌ఇన్‌సిల్వర్ ప్లాట్‌ఫామ్‌తో రూ.50 కోట్ల టర్నోవర్ లక్ష్యం
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:04 AM
ఐటీ సర్వీసులు, డిజిటల్ కామర్స్ సంస్థ నీహార్ ఇన్ఫో గ్లోబల్ లిమిటెడ్..తన కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా...
నీహార్ ఇన్ఫో గ్లోబల్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఐటీ సర్వీసులు, డిజిటల్ కామర్స్ సంస్థ నీహార్ ఇన్ఫో గ్లోబల్ లిమిటెడ్..తన కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా గోల్డ్‌ఇన్‌సిల్వర్.షా్‌ప ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు సంస్థ చైర్మన్ బీఎస్ఎన్ సూర్యనారాయణ వెల్లడించారు. బంగారం, వెండి నాణేలు, ఇతరత్రా సేవలను ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ పాంప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. త్వరలోనే డిజిటల్ గోల్డ్, సిల్వర్ లావాదేవీలను సేఫ్‌గోల్డ్ సంస్థ ద్వారా ప్రారంభించనున్నట్లు సూర్యనారాయణ చెప్పారు. అలాగే జీరోధాతో కలిసి బంగారం, వెండి ఈటీఎప్‌లను ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గోల్డ్‌ఇన్‌సిల్వర్ ప్లాట్‌ఫామ్ ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి రూ.50-100 కోట్ల టర్నోవర్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. కాగా సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్ధంలో నీహార్ ఇన్ఫో రూ.6.87 కోట్ల టర్నోవర్‌పై రూ.10.18 లక్షల నికర లాభాన్ని ఆర్జించింది.
ఈ వార్తలనూ చదవండి:
జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్
ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..