నయా ఫండ్స్..
ABN , Publish Date - Aug 09 , 2026 | 02:48 AM
కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ.. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ ఓమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌ఓఎ్‌ఫ)ను ప్రారంభించింది. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్స్ ఆధారంగా...
కోటక్ ఆల్ క్యాప్ ఓమ్ని ఎఫ్‌ఓఎఫ్
కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ.. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ ఓమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌ఓఎ్‌ఫ)ను ప్రారంభించింది. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్స్ ఆధారంగా ఈక్విటీ ఆధారిత, ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్ పధకాల్లో పెట్టుబడులు పెట్టే ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.1,000. సిప్ అయితే రూ.500. ముగింపు తేదీ ఈ నెల 19.
కోటక్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్
కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్.. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 17. కనీస పెట్టుబడి రూ.1,000.
బంధన్ కాంట్రా ఫండ్
బంధన్ మ్యూచువల్ ఫండ్.. కాంట్రా ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించటంతో పాటు ఫండమెంటల్స్ పటిష్ఠంగా ఉన్న రంగాలను ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టడం ఈ ఫండ్ ప్రత్యేకత. ఈ నెల 10న ప్రారంభం కానున్న ఈ ఫండ్ ముగింపు తేదీ 24.
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ షార్ట్ టర్మ్ ఫండ్
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ (ఇండియా).. షార్ట్ టర్మ్ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ షార్ట్ టర్మ్ డెట్ పథకం. ఏడాది నుంచి మూడేళ్ల కాలవ్యవధి కలిగిన అత్యుత్తమ కార్పొరేట్ డెట్ సెక్యూరిటీస్, ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర అభివృద్ధి రుణాలు (ఎస్‌డీఎల్‌ఎస్) సహా మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.5,000. ముగింపు తేదీ ఈ నెల 13.
ఈ వార్తలు కూడా చదవండి
ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ