Share News

నేటి నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం

ABN , Publish Date - Apr 01 , 2026 | 02:53 AM

బుధవారం నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం, 2025 అమల్లోకి వస్తోంది. దీంతో ఇప్పటి వరకు ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా నగరాల్లోని ఉద్యోగులకు మాత్రమే...

నేటి నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం

ఉద్యోగులకు పెద్ద ఊరట

న్యూఢిల్లీ: బుధవారం నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం, 2025 అమల్లోకి వస్తోంది. దీంతో ఇప్పటి వరకు ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా నగరాల్లోని ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన మూలవేతనంలో 50 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇప్పుడు హైదరాబాదీలకు కూడా వర్తించనుంది. హైదరాబాద్‌తో పాటు అహ్మదాబాద్‌, బెంగళూరు, పుణె నగరాల్లోని ఉద్యోగులకూ ఈ 50 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుంది. ఇప్పటి వరకు ఈ నగరాల్లోని ఉద్యోగుల మూలవేతనంలో 40 శాతాన్ని మాత్రమే హెచ్‌ఆర్‌ఏగా అనుమతించేవారు.

కొత్త ఐటీ చట్టం ప్రధానాంశాలు

  • వార్షిక వడ్డీ ఆదాయం రూ.50,000 మించితే టీడీఎస్‌

  • హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు క్లెయుమ్‌ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇంటి యజమాని పూర్తి వివరాలు సమర్పించాలి

  • ఇద్దరు పిల్లల పరిమితికి లోబడి పిల్లల చదువుల కోసం వారి చదువుల కోసం చేసే నెలవారీ ఖర్చుల మినహాయింపు రూ.100 నుంచి రూ.3,000కు పెంపు

  • పిల్లల నెలవారీ హస్టల్‌ బిల్లు మినహాయింపు పరిమితి రూ.300 నుంచి రూ.9,000కు పెంపు

  • కంపెనీలు ఉద్యోగులకు అందించే ఒక్కో భోజనం ఖర్చు మినహాయింపు రూ.50 నుంచి రూ.200కు పెంపు

  • దీనివల్ల ఒక్కో ఉద్యోగికి ఏటా రూ.1.05 లక్షల వరకు లబ్ది

  • కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే వార్షిక బహుమతుల పన్ను మినహాయింపు పరిమితి రూ.5,000 నుంచి రూ.15,000కు పెంపు

  • ఉద్యోగుల నుంచి విస్తృత ప్రామాణిక సమాచార సేకరణ కోసం ఫారం 16 స్థానంలో ఇక ఫారం 130

  • మరిన్ని లావాదేవీల వివరాలు పాన్‌ పరిధిలోకి

ఇవీ చదవండి:

ఇండిగో కొత్త సీఈఓగా విలియమ్ వాల్ష్

Updated Date - Apr 01 , 2026 | 02:53 AM