హైదరాబాద్‌లో నెస్లే జీసీసీ
ABN , Publish Date - Jul 07 , 2026 | 02:14 AM
హైదరాబాద్‌లో మరో బహుళ జాతి దిగ్గజం తన గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) ఏర్పాటు చేయనుంది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌లో మరో బహుళ జాతి దిగ్గజం తన గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) ఏర్పాటు చేయనుంది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ నెస్లే ఈ జీసీసీని ఏర్పాటు చేయనుంది. నెస్లే బిజినెస్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌బీఎ్‌సఐపీఎల్), ప్రముఖ టెక్నాలజీ అండ్ ప్రాసెస్ సొల్యూషన్స్ కంపెనీ జెన్‌పాక్ట్ భాగస్వామ్యంతో ఈ జీసీసీని ఏర్పాటు చేయబోతున్నట్టు నెస్లే వెల్లడించింది. అయితే ఎంత పెట్టుబడితో, ఎప్పటిలోగా ఈ జీసీసీని ఏర్పాటు చేసేది మాత్రం వెల్లడించలేదు. ఈ జీసీసీ కోసం జెన్‌పాక్ట్.. ప్రాసెస్ ఇంటలిజెన్స్, డేటా, ఏఐ, ఆటోమేషన్లలో తనకున్న నైపుణ్యాలను అందిస్తుంది.
దీనివల్ల నెస్లే తన బిజినెస్ సర్వీసులను సులభతరంగా ప్రామాణీకరించి విస్తరించగలుగుతుందని నెస్లే ఒక ప్రకటనలో తెలిపింది. అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో తమ జీసీసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు నెస్లే తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ నిర్ణయం
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..