Share News

నెఫ్రోప్లస్‌ లాభంలో 27 శాతం వృద్ధి

ABN , Publish Date - May 20 , 2026 | 05:42 AM

నెఫ్రోప్లస్‌ పేరుతో డయాలసిస్‌ సేవలందిస్తున్న నెఫ్రోకేర్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌.. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో...

నెఫ్రోప్లస్‌ లాభంలో 27 శాతం వృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నెఫ్రోప్లస్‌ పేరుతో డయాలసిస్‌ సేవలందిస్తున్న నెఫ్రోకేర్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌.. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.265.60 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.35.10 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 27.4 శాతం పెరగగా ఆదాయం 21.2 శాతం వృద్ధి చెందింది. భారత్‌ సహా కంపెనీ సేవలందిస్తున్న మార్కెట్లలో డయాలసిస్‌ సేవల విస్తరణతో ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేసినట్లు పేర్కొంది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.998.80 కోట్ల ఆదాయంపై రూ.128.30 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి..

గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన

పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..

Updated Date - May 20 , 2026 | 05:42 AM