Share News

రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.1,279 కోట్ల సమీకరణ

ABN , Publish Date - Sep 26 , 2026 | 02:37 AM

రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.1,279.35 కోట్లు సమీకరించనున్నట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. ఈ మేరకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం లభించిందని తెలిపింది.

రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.1,279 కోట్ల సమీకరణ
natco pharma

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.1,279.35 కోట్లు సమీకరించనున్నట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. ఈ మేరకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం లభించిందని తెలిపింది. రైట్స్‌ ఇష్యూలో భాగంగా రూ.2 ముఖ విలువ కలిగిన 1,70,58,082 ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటీ రూ.750 చొప్పున జారీ చేయనున్నట్లు నాట్కో వెల్లడించింది. రైట్స్‌ ఇష్యూలో షేర్ల జారీకి అర్హులైన వాటాదారులను అక్టోబరు 1న గుర్తించనున్నట్లు తెలిపింది. ప్రతి 21 ఫుల్లీ పెయిడప్‌ ఈక్విటీ షేర్లకు గాను 2 రైట్స్‌ ఈక్విటీ షేర్లను వాటాదారులకు జారీ చేయనుంది. అక్టోబరు 12 నుంచి 22 వరకు ఈ ఇష్యూ కొనసాగనుంది.

Updated Date - Sep 26 , 2026 | 02:37 AM