Share News

నాట్కో లాభంలో 61శాతం క్షీణత

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:30 AM

నాట్కో ఫార్మా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది.

నాట్కో లాభంలో 61శాతం క్షీణత
natco

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నాట్కో ఫార్మా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 60.8 శాతం క్షీణించి రూ.202.60 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.517.90 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం రెవెన్యూ కూడా రూ.1,463 కోట్ల నుంచి రూ.1,019.40 కోట్లకు తగ్గింది. సెప్టెంబరు త్రైమాసికంలో లెనాలిడొమైడ్‌ ఆదాయాలు తక్కువగా ఉండటం పనితీరుపై ప్రభావం చూపించిందని పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే మాత్రం అంతర్జాతీయ ఫార్ములేషన్స్‌ వ్యాపారం మెరుగ్గా ఉందని పేర్కొంది. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ మొత్తం రెవెన్యూ రూ.794.40 కోట్లుగా నమోదైంది. కాగా కంపెనీ డైరెక్టర్ల బోర్డు రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.1.25 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది

Updated Date - Nov 14 , 2026 | 02:15 AM