దక్షిణాఫ్రికాలో నాట్కో రూ.2,500 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Jul 09 , 2026 | 03:40 AM
దక్షిణాఫ్రికాలో దాదాపు రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని...
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో దాదాపు రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని హైదరాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ నాట్కో ఫార్మా బుధవారం ప్రకటించింది. అందులో రూ.1,400 కోట్లను తన పూర్తి అనుబంధ విభాగమైన నాట్కో ఫార్మా సౌత్ ఆఫ్రికా ప్రొప్రైటరీ లిమిటెడ్‌లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ అనుబంధ విభాగం ద్వారా మరిన్ని కొత్త మార్కెట్లలోకి ప్రవేశించే లక్ష్యంతో సంస్థ ఈ పెట్టుబడులు పెడుతోంది. అలాగే, దక్షిణాఫ్రికాకు చెందిన ఫార్మా సంస్థ అడ్కాక్ ఇన్‌గ్రామ్‌లో మరో రూ.1,069 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు నాట్కో తెలిపింది. తద్వారా అడ్కాక్‌లో నాట్కో వాటా ప్రస్తుత 35.75 శాతం నుంచి 49 శాతానికి పెరగనుంది.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి
ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్..!