Mutual Funds India: ‘ఫండ్’గ చేసుకున్నాయ్
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:20 AM
మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి 2025లోనూ భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2025లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ...
ఎంఎఫ్ ఆస్తుల విలువ
@: రూ.81 లక్షల కోట్లు
మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి 2025లోనూ భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2025లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ మరో రూ.14 లక్షల కోట్లు (21ు) పెరిగి, నవంబరు నాటికి మొత్తం రూ.81 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఫండ్ పథకాల్లో చిన్న మదుపరుల పెట్టుబడులు, ముఖ్యంగా క్రమానుగత పెట్టుబడులు (సిప్) భారీగా పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గత ఏడాది ఇన్వెస్టర్లు ఏకంగా రూ.7 లక్షల కోట్లు ‘సిప్’ చేశారు. ఇండస్ట్రీకి 2026 సంవత్సరం కూడా సానుకూలంగా ఉండనుందని, సిప్ పెట్టుబడుల జోరు ఇందుకు తోడ్పడనుందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా(యాంఫీ) సీఈఓ చలసాని వెంకట్ అన్నారు. గడిచిన ఐదేళ్లలో ఫండ్ ఆస్తుల మొత్త విలువ ఏకంగా రూ.50 లక్షల కోట్లు పెరిగింది.
ఇవి కూడా చదవండి
మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి