చిన్న వ్యాపారులకు కేంద్రం చేయూత!
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:46 AM
పశ్చిమాసియా యుద్ధ ప్రభావిత వ్యాపారాలు, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎ్‌సఎంఈ) మద్దతుగా కేంద్ర ప్రభుత్వం...
2.50 లక్షల కోట్ల రుణ హామీ పథకంపై కసరత్తు
రూ.100 కోట్ల వరకు రుణంలో 90ు మేర హామీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావిత వ్యాపారాలు, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎ్‌సఎంఈ) మద్దతుగా కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షల కోట్ల రుణ హామీ పథకాన్ని ప్రకటించే ఆలోచనలో ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ ప్రతిపాదనను కేబినెట్‌కు పంపడం జరిగిందని, కొద్ది రోజుల్లోనే ఆమోదం లభించే అవకాశం ఉందని వారన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా వ్యాపారంలో నష్టపోయి బకాయిల చెల్లింపుల్లో విఫలమైన రుణగ్రహీతలకు ఈ పథకం ద్వారా రూ.100 కోట్ల వరకు రుణంలో 90ు మేర ప్రభుత్వ హామీ లభించనుంది. ఈ స్కీమ్ నాలుగేళ్లపాటు కొనసాగించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు తీసుకున్న బ్యాంక్ రుణాలకు కేంద్ర ప్రభుత్వ పూర్తి అనుబంధ విభాగమైన నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌సీజీటీసీ) హామీ ఇవ్వనుంది. ఈ పథకం కోసం కేంద్రం రూ.17,000-18,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. కొవిడ్ సంక్షోభ సమయంలోనూ మోదీ సర్కారు ప్రకటించిన ఈ పథకం విజయవంతమైంది. పలు రంగాల పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలపై డిఫాల్టర్ (రుణ ఎగవేతదారు) ముద్ర పడకుండా ఆదుకోవడంతోపాటు వ్యాపారాలను గడ్డుకాలం నుంచి గట్టెక్కించింది.
గత పథకం విజయవంతం
కరోనా వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కుదేలైన వ్యాపారాలను ఆదుకునేందుకు కేంద్రం 2020 మే నెలలో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌ను (ఈసీఎల్‌జీఎస్) ప్రకటించింది. ముఖ్యంగా ఎంఎ్‌సఎంఈలు, ఇతర వ్యాపార సంస్థల బ్యాంక్ బకాయిలను పరిష్కరించడంతోపాటు వ్యాపారాన్ని పునః ప్రారంభించేందుకు వీలుగా ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈసీఎల్‌జీఎ్‌సను దాదాపు అన్ని రంగాలకు వర్తింపజేయడంతోపాటు కేంద్రం 100 శాతం రుణ హామీ కల్పించింది. 2023 మార్చి 31 వరకు ఈ స్కీమ్ కొనసాగింది.
ఇవి కూడా చదవండి..
యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..