Share News

ఫోన్లు ప్రియం!

ABN , Publish Date - Sep 30 , 2026 | 02:42 AM

ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్‌)లో భారత మార్కెట్లో మొబైల్‌ ఫోన్ల ధరలు సగటున 16శాతం పెరిగాయని మార్కెట్‌ పరిశోధక సంస్థ కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తాజా నివేదిక వెల్లడించింది

ఫోన్లు ప్రియం!
MOBILE PHONE

  • ఈ ఏడాది ప్రథమార్ధంలో 16శాతం పెరిగిన ధరలు

మార్కెట్లోకి ఫోన్ల సరఫరాలు భారీగా తగ్గొచ్చు..

  • కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్‌)లో భారత మార్కెట్లో మొబైల్‌ ఫోన్ల ధరలు సగటున 16శాతం పెరిగాయని మార్కెట్‌ పరిశోధక సంస్థ కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తాజా నివేదిక వెల్లడించింది. ఏఐ డేటా సెంటర్ల నుంచి అనూ హ్య డిమాండ్‌ కారణంగా అంతర్జాతీయ మార్కె ట్లో మెమొరీ చిప్‌ల ధరలు భారీగా పెరగడం, రూపాయి క్షీణతతో వీటి దిగుమతులు మరింత భారంగా మారడం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. మొత్తంగా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ వృద్ధి రెండంకెల స్థాయిలో తగ్గవచ్చని కౌంటర్‌పాయింట్‌ అంచనా వేసింది.

మరిన్ని విషయాలు..

ఈ ఏడాది జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ విక్రయ సగటు ధర 318 డాలర్లుగా నమోదైంది. ప్రథమార్ధంలో రూ.10,000 లోపు ఫోన్ల ధరల పెరుగుదల సగటు అత్యధికంగా 32 శాతంగా ఉంది. ఈ విభాగ ఫోన్ల సరఫరాలు వార్షిక ప్రాతిపదికన 65శాతంతగ్గాయి. రూ.10,000-15,000 ధరల శ్రేణిలోని ఫోన్ల సరఫరాలు 20శాతం తగ్గగా.. రూ.20 వేలకు పైగా విలువైన ఫోన్ల అమ్మకాలు మాత్రం పెరిగాయి.

Updated Date - Sep 30 , 2026 | 02:45 AM