Share News

వచ్చే నెలలో మెటాలో లేఆఫ్స్! ఈసారి..

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:33 AM

మెటా సంస్థ మరోసారి లేఆఫ్స్‌కు సిద్ధమైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వచ్చే నెల చివరికల్లా 8 వేల మందిని తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

వచ్చే నెలలో మెటాలో లేఆఫ్స్! ఈసారి..
Meta Layoffs

ఇంటర్నెట్ డెస్క్: టెక్ రంగంలో లేఆఫ్స్ కలకలం కొనసాగుతోంది. మెటా సంస్థ మరోసారి లేఆఫ్స్‌కు సిద్ధమైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వచ్చే నెల చివరికల్లా 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు మెటా సిద్ధమైనట్టు సమాచారం. ఆ తరువాతి నెలల్లో మరిన్ని తొలగింపులు ఉంటాయని కూడా తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా సంస్థలోని ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించేందుకు మెటా సిద్ధమైనట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో మరిన్ని తొలగింపులు కూడా ఉంటాయని తెలుస్తోంది. అయితే, ఈ వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మార్పులను బట్టి సంస్థ ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా సంస్థ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించేందుకు మెటా యోచిస్తున్నట్టు గత నెలలోనే వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ కథనాలపై మెటా ఇంకా స్పందించాల్సి ఉంది.


యూఎస్ కార్పొరేట్ కంపెనీలు అనేకం ఏఐపై భారీగా నిధులను కుమ్మరిస్తున్నాయి. మెటా సీఈఓ మార్క్ జకర్‌బర్గ్ కూడా ఏఐ కేంద్రంగా సంస్థలో మార్పులు తెచ్చేందుకు భారీగా పెట్టుబడులను కుమ్మరిస్తున్నారు. ఇతర యూఎస్ కంపెనీలు కూడా లేఆఫ్స్ చేపడుతున్నాయి. ఇటీవల కాలంలో అమెజాన్ తనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 10 శాతం (30 వేల ఉద్యోగులు) మందిని తొలగించింది. మరో ఫిన్‌టెక్ సంస్థ బ్లాక్ ఫిబ్రవరి నెలలో నాలుగు వేల మందిని సాగనంపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉత్పాదకత పెరిగిన నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు చేపట్టినట్టు బ్లాక్ సీఈఓ జాక్ డోర్సీ అప్పట్లో పేర్కొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు

ఏఐపై వైట్‌కాలర్ ఉద్యోగుల తిరుగుబాటు!

Updated Date - Apr 18 , 2026 | 11:59 AM