మెర్సిడెస్ మేబాక్ ఎస్580ఈ
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:14 AM
మెర్సిడెస్ బెంజ్.. మార్కెట్లోకి మేబాక్ ఎస్580ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కారు (పీహెచ్‌ఈవీ)ను తీసుకువచ్చింది. ఈ కారు ధర రూ.3.35 కోట్లు...
మెర్సిడెస్ బెంజ్.. మార్కెట్లోకి మేబాక్ ఎస్580ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కారు (పీహెచ్‌ఈవీ)ను తీసుకువచ్చింది. ఈ కారు ధర రూ.3.35 కోట్లు. మేబాక్ ఎస్ 580ఈ కారును 4మాటిక్, 3.0 లీటర్ పెట్రోల్, అడ్వాన్స్‌డ్ సిక్స్ సిలిండర్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో రూపొందించింది. ఈ కారు పూర్తి ఎలక్ట్రిక్ శ్రేణిలో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 22 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో కూడిన ఎస్580ఈ కారు ప్రయాణంలో 11 కేడబ్ల్యూ ఏసీ ఆన్‌బోర్డ్ చార్జర్‌తో చార్జింగ్ కానుంది. అలాగే దూర ప్రయాణాల కోసం 60 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరలో GST కౌన్సిల్ భేటీ.. సంచలన సంస్కరణలకు శ్రీకారం!
స్థిరంగా పసిడి ధరలు.. ప్రస్తుతం రేట్స్ ఇవీ