Share News

కైగా అణు విద్యుత్‌ కేంద్రంలో పీహెచ్‌డబ్ల్యూఆర్‌

ABN , Publish Date - Jul 07 , 2026 | 02:08 AM

మౌలిక ప్రాజెక్టుల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌)..అణు విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణంలోనూ...

కైగా అణు విద్యుత్‌ కేంద్రంలో  పీహెచ్‌డబ్ల్యూఆర్‌

రియాక్టర్‌ కాంక్రీట్‌ పనులు పూర్తి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మౌలిక ప్రాజెక్టుల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌)..అణు విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణంలోనూ తన సత్తా చాటుతోంది. కర్ణాటకలోని కైగా అణు విద్యుత్‌ కేంద్రం వద్ద యూనిట్‌ 5, యూనిట్‌ 6 పేరుతో భారతీయ అణు విద్యుత్‌ సంస్థ (ఎన్‌పీసీఐ) నిర్మిస్తున్న ప్రెజరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్‌ (పీహెచ్‌డబ్ల్యూఆర్‌) నిర్మాణానికి అవసరమైన కాంక్రీట్‌ పోత కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్టు ఎంఈఐఎల్‌ తెలిపింది. ఇందుకోసం క్యూబిక్‌ మీటర్‌కు 360 కిలోల రీబార్స్‌ మందంతో 7,250 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను పోసినట్టు పేర్కొంది. ఇందుకోసం పూర్తి భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు, సూపర్‌వైజర్లు, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షకులు, సర్వేయర్లు, టెక్నీషియన్లు, ఆపరేటర్లు, నిపుణులైన కార్మికులు రేయింబవళ్లు కష్టపడినట్టు తెలిపింది. అణు విద్యుత్‌ ప్రాజెక్టుల కీలక నిర్మాణాల్లో ఇది తమకు ఒక మైలురాయి అని పేర్కొంది. మేఘా ఇంజనీరింగ్‌కు ఇది తొలి అణు విద్యుత్‌ నిర్మాణ ప్రాజెక్టు.

ఈ వార్తలనూ చదవండి:

చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్‌ ప్లస్‌ నిర్ణయం

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

Updated Date - Jul 07 , 2026 | 02:08 AM