ఆరేళ్లలో ఏడు కొత్త ఎస్‌యూవీలు
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:57 AM
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) రాబోయే ఐదారేళ్ల కాలంలో ఏడు కొత్త ఎస్‌యూవీలను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. వేగంగా విస్తరిస్తున్న ఎస్‌యూవీల విభాగంలో వాటా పెంచుకోవడం...
మారుతి సుజుకీ సీఈఓ హిసాషి
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) రాబోయే ఐదారేళ్ల కాలంలో ఏడు కొత్త ఎస్‌యూవీలను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. వేగంగా విస్తరిస్తున్న ఎస్‌యూవీల విభాగంలో వాటా పెంచుకోవడం తమ లక్ష్యమని కంపెనీ ఎండీ, సీఈఓ హిసాషి టకూచి మంగళవారం ఈ విషయం వెల్లడించారు. తొలిసారి కారు కొనుగోలు చేసే వారిని ఆకర్షించడం లక్ష్యంగా ‘‘సుజుకీకే ప్రత్యేకం’’ అయిన ఎంట్రీ లెవెల్ కారు కూడా ఒకటి ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. భారత ప్రయాణికుల వాహన మార్కెట్లో ఎస్‌యూవీల వాటా 2019లో 26.5ు ఉండగా 2024 నాటికి 54.7 శాతానికి చేరిందన్నారు. అలాగే ఎస్‌యూవీల మార్కెట్లో ఎంఎ్‌సఐ వాటా 2019-20 నాటికి 16.8ు ఉండగా 2019-20 నాటికి 19.6 ఽశాతానికి పెరిగినట్టు తెలిపారు.
ఆదాయపు పన్ను నోటీసు: మారుతి సుజుకీ ఇండియాకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి రూ.5,786.4 కోట్ల అసె్‌సమెంట్ ఆర్డర్ అందింది. దీన్ని వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ లో సవాలు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇది రొటీన్‌గా వచ్చే ఆర్డరేనని, దాని ప్రభావం ఆర్థికంగా కంపెనీపై ఏ మాత్రం ఉండదని ఎంఎ్‌సఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..
మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..