Stock Market Today: రెండో రోజూ మార్కెట్ డౌన్
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:28 AM
ఈక్విటీ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్ 244.98 పాయింట్ల నష్టంతో 83,382.71 వద్ద...
ముంబై: ఈక్విటీ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్ 244.98 పాయింట్ల నష్టంతో 83,382.71 వద్ద ముగియగా నిఫ్టీ 66.70 పాయింట్లు నష్టపోయి 25,665.60 వద్ద ముగిసింది. మెటల్స్, కమోడిటీస్, ఎనర్జీ షేర్లలో కొనుగోళ్లు సూచీల నష్టాలను పరిమితం చేశాయి.
షాడోఫ్యాక్స్ ఇష్యూ ధర శ్రేణి రూ.118-124
లాజిస్టిక్ సేవలందించే షాడోఫ్యాక్స్ వచ్చే మంగళవారం నుంచి ప్రారంభం కానున్న తమ ఐపిఓలో షేర్ల ధర శ్రేణిని ప్రకటించింది. ఒక్కో షేరు ధర శ్రేణి రూ.118-124గా నిర్ణయించింది. గరిష్ఠ ధరలో కంపెనీ విలువ రూ.7,100 ఉంటుంది. ఈ ఇష్యూ 20న ప్రారంభమై 22వ తేదీన ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి..
చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..