Share News

హెయిర్‌ షాంపు విభాగంలోకి మారికో

ABN , Publish Date - May 27 , 2026 | 05:19 AM

దేశీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం మారికో తమ హెయిర్‌ కేర్‌ వ్యాపార విస్తరణలో భాగంగా షాంపు మార్కెట్లోకి అడుగుపెట్టింది...

హెయిర్‌ షాంపు విభాగంలోకి మారికో

న్యూఢిల్లీ: దేశీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం మారికో తమ హెయిర్‌ కేర్‌ వ్యాపార విస్తరణలో భాగంగా షాంపు మార్కెట్లోకి అడుగుపెట్టింది. కొబ్బరి నూనె విభాగంలో ప్రముఖ బ్రాండ్‌గా ఉన్న పారాచూట్‌ను ఇప్పుడు షాంపు కేటగిరీకి విస్తరిస్తూ పారాచూట్‌ అడ్వాన్స్‌డ్‌ ప్రోటీన్‌ పేరుతో దీన్ని విడుదల చేసింది. ప్రసుత్తం దేశీయ షాంపు మార్కెట్‌ విలువ రూ. 10,000 కోట్లకు పైనే ఉండగా, 9-10 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తోంది. దీం తో ఈ మార్కెట్‌ డిమాండ్‌ను అందిపుచ్చుకునే లక్ష్యంతో మారికో తన పోర్టుఫోలియోను మరింత విస్తరించింది.

ఇవి కూడా చదవండి..

ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..

నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

Updated Date - May 27 , 2026 | 05:19 AM