కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మలబార్ గోల్డ్ ఆభరణాలు
ABN , Publish Date - May 28 , 2026 | 02:47 AM
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆభరణాలు మెరిశాయి. ఇటీవల జరిగిన 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ నటి అలియా భట్....
హైదరాబాద్: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆభరణాలు మెరిశాయి. ఇటీవల జరిగిన 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ నటి అలియా భట్.. మలబార్ గోల్డ్‌కు చెందిన కళాత్మక ఆభరణాలను ధరించి అత్యంత అద్భుతంగా కనిపించారు. రియా కపూర్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన వస్త్రాలను ధరించిన అలియా భట్.. తన ఆహార్యాన్ని మరింతగా పెంచుకునేందుకు మలబార్ గోల్డ్ కళాత్మకంగా రూపొందించిన సిలోన్ నీలమణి, వజ్రాలతో కూడిన ఆభరణాలను ధరించారు. అలాగే చెవి పోగులు, సఫైర్ ఉంగరాలు, వజ్రాల పెండెంట్స్ కూడా ఉన్నాయి. ఫ్యాషన్, కళ, నైపుణ్యం అన్నీ ఒకే చోట కలిసే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అలియా భట్ భాగస్వామ్యంతో తమ ఆభరణాలను ప్రదర్శించటం తమ పనితీరుకు నిదర్శనమని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్ అన్నారు. ప్రపంచ ఫ్యాషన్, లగ్జరీ వేదికలపై మలబార్ బ్రాండ్ స్థానాన్ని ఇది మరింత బలోపేతం చేసిందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి.