Share News

మలబార్‌ గోల్డ్‌ 20 కొత్త షోరూమ్‌లు

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:03 AM

జువెలరీ రిటైల్‌ దిగ్గజం మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌.. రూ.1,580 కోట్ల భారీ పెట్టుబడితో మెగా విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఈ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 20 కొత్త...

మలబార్‌ గోల్డ్‌  20 కొత్త షోరూమ్‌లు

రూ. 1,580 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: జువెలరీ రిటైల్‌ దిగ్గజం మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌.. రూ.1,580 కోట్ల భారీ పెట్టుబడితో మెగా విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఈ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 20 కొత్త షోరూమ్‌లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, సంగారెడ్డి, విశాఖపట్నంలోని ఇనార్బిట్‌ మాల్‌, చిత్తూరుల్లో ఈ షోరూమ్‌లను ఏర్పాటు చేయనుంది. అలాగే బెంగళూరు, గురుగ్రామ్‌, కోల్‌కతా, గువహటి, రాంచీ, గ్వాలియర్‌ తదితర నగరాల్లో ఈ షోరూమ్‌లను ప్రారంభించనుంది. ఈ మెగా విస్తరణ ద్వారా 725 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మలబార్‌ గోల్డ్‌ వెల్లడించింది. కాగా ఈ విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా మలబార్‌ గ్రూప్‌ షోరూమ్‌ల సంఖ్య 445కి చేరుకోనుంది.

ఇవి కూడా చదవండి..

సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..

మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 18 , 2026 | 02:03 AM