మహీంద్రా వాహనాల ధరలు 2.5 శాతం పెంపు
ABN , Publish Date - Apr 03 , 2026 | 02:08 AM
పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల భారాన్ని తగ్గించుకునేందుకు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా...
ముంబై: పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల భారాన్ని తగ్గించుకునేందుకు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) ప్రకటించింది. నాన్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు, వాణిజ్య వాహనాల ధరలను గరిష్టంగా 2.5 శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది. మొత్తం వాహన పోర్ట్‌ఫోలియోపై ధరల పెంపు సగటున 1.6 శాతం ఉంటుందని పేర్కొంది. ఈ నెల 6 నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి...
ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి
Read Latest Telangana News And Telugu News