Share News

కాలుష్య సంబంధిత ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు పెరిగాయ్‌..

ABN , Publish Date - Nov 15 , 2026 | 04:20 AM

గత మూడేళ్లలో కాలుష్య సంబంధిత ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు 4.3 రెట్లు పెరిగినట్లు బీమా మార్కెట్‌ ప్లేస్‌ పాలసీబజార్‌ నివేదిక వెల్లడించింది. మొత్తం క్లెయిమ్‌లలో...

కాలుష్య సంబంధిత ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు పెరిగాయ్‌..

మూడేళ్లలో 4.3 రెట్ల పెరుగుదల

గత మూడేళ్లలో కాలుష్య సంబంధిత ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు 4.3 రెట్లు పెరిగినట్లు బీమా మార్కెట్‌ ప్లేస్‌ పాలసీబజార్‌ నివేదిక వెల్లడించింది. మొత్తం క్లెయిమ్‌లలో గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల క్లెయిమ్‌లే 78 శాతం ఉన్నాయని పేర్కొంది. ఇందులో గుండె సంబంధిత వ్యాధుల వాటా 43.5 శాతం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 35 శాతం, న్యుమోనియా 11.2 శాతం ఉన్నాయి. 31-55 ఏళ్ల వయసున్న ఉద్యోగులు 59 శాతం క్లెయిమ్‌లు చేయగా.. సీనియర్‌ సిటిజన్స్‌ 31 శాతం, 21-30 ఏళ్ల మధ్య వయసున్న యువత 6.7 శాతం, 20 ఏళ్లలోపు వయసున్న పిల్లలు 3.7 శాతం క్లెయిమ్‌లను చేసినట్టు తెలిపింది. కాలుష్య సంబంధిత ఆరోగ్య బీమా క్లెయిమ్‌లలో ఉద్యోగులు, సీనియర్‌ సిటిజన్ల వాటాయే దాదాపు 90 శాతం ఉంది. ఇక ఢిల్లీలో అత్యధికంగా 8,093 క్లెయిమ్‌లు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో పుణె, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌ ఉన్నాయి. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కలిపి క్లెయిమ్‌లలో 55 శాతం వాటాను కలిగి ఉండటం గమనార్హం. అక్టోబరు-మార్చి మధ్య కాలంలో అత్యధికంగా కాలుష్య సంబంధిత బీమా క్లెయిమ్‌లు నమోదయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కాలుష్య సంబంధిత క్లెయిమ్‌లలో దాదాపు 56 శాతం అక్టోబరు-మార్చి కాలంలోనే నమోదు కావడం గమనార్హం. కాగా మొత్తం క్లెయిమ్‌ల చెల్లింపులు 4.5 రెట్లు పెరిగి రూ.241.6 కోట్లకు చేరుకున్నాయి. సగటు క్లెయిమ్‌ మొత్తం రూ.62,662గా ఉంది.

మహానది కోల్‌ఫీల్డ్స్‌ రూ.9,500 కోట్ల ఐపీఓ

ప్రభుత్వ రంగంలోని కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ మహానది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎంసీఎల్‌).. పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ద్వారా రూ.9,500 కోట్లు సమీకరించనుంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (ఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఈ ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్ఎస్‌) రూపంలో ఉండనుంది. ఎంసీఎల్‌లో 10 శాతానికి సమానమైన 66.18 కోట్ల ఈక్విటీ షేర్లను కోల్‌ ఇండియా విక్రయించనుంది. ఎలాంటి కొత్త షేర్ల జారీ లేదు. దీంతో ఐపీఓ ద్వారా వచ్చిన నిధులు పూర్తిగా కోల్‌ ఇండియాకు చేరనున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్

ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..

Updated Date - Nov 15 , 2026 | 04:20 AM