రిటైల్ రుణాలపై మరింత ఫోకస్
ABN , Publish Date - Sep 01 , 2026 | 03:51 AM
ప్రైవేట్ రంగంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ).. రిటైల్, వ్యవసాయ, ఎంఎ్‌సఎంఈ (ఆర్‌ఏఎం) రుణాలపై మరింత దృష్టి పెడుతున్నట్లు...
కరూర్ వైశ్యా బ్యాంక్ ఎండీ, సీఈఓ రమేశ్ బాబు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రైవేట్ రంగంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ).. రిటైల్, వ్యవసాయ, ఎంఎ్‌సఎంఈ (ఆర్‌ఏఎం) రుణాలపై మరింత దృష్టి పెడుతున్నట్లు వెల్లడించింది. సోమవారం నాడిక్కడ కేవీబీ ఎండీ, సీఈఓ రమేశ్ బాబు మాట్లాడుతూ.. రిటైల్, వ్యవసాయ, ఎంఎ్‌సఎంఈ రంగాల నుంచి రుణాలకు డిమాండ్ పెరుగుతూ వస్తోందని, అందుకు తగ్గట్టుగా తాము ఈ విభాగం ప్రత్యేకంగా దృష్టిని సారిస్తున్నట్లు తెలిపారు. అయితే కార్పొరేట్ రుణాల విషయంలో మాత్రం తాము ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.
మార్చి నాటికి 1,000 శాఖలు: కార్యకలాపాల విస్తరణలో భాగంగా సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 16 శాఖలను ప్రారంభించినట్లు రమేశ్ బాబు తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో ఐదు, తెలంగాణలో మూడు శాఖలను ఏర్పాటు చేయగా మిగిలిన 8 శాఖలను తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో నెలకొల్పినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త శాఖలతో మొత్తం బ్రాంచీల సంఖ్య 919కి చేరగా వచ్చే మార్చి నాటికి వీటిని 1,000కి చేర్చాలని చూస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి
ఎడ్యుకేషన్ హబ్‌గా హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్
రామ మందిరానికి రూ.4 కోట్ల విరాళం.. అకౌంట్లో మాత్రం రూ.3!