జోయాలుక్కాస్ అక్షయ తృతీయ ఆఫర్లు
ABN , Publish Date - Apr 11 , 2026 | 05:58 AM
ఆభరణాల రిటైలింగ్ దిగ్గజం జోయాలుక్కాస్ అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ‘‘క్యాష్‌బాక్ ఫెస్ట్’’ను ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి 20 వరకు ఇది అమలులో...
హైదరాబాద్: ఆభరణాల రిటైలింగ్ దిగ్గజం జోయాలుక్కాస్ అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ‘‘క్యాష్‌బాక్ ఫెస్ట్’’ను ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి 20 వరకు ఇది అమలులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా కస్టమర్లకు ఆకర్షణీయమైన గిఫ్ట్ ఓచర్లను అందచేస్తామని కంపెనీ చైర్మన్, ఎండీ డాక్టర్ జాయ్ అలుక్కాస్ తెలిపారు. రూ.75,000, ఆ పైబడిన ధరలో వజ్రాలు, అన్‌కట్ డైమండ్స్, ప్లాటినం ఆభరణాలు కొనుగోలు చేసే వారికి రూ.2,000 గిఫ్ట్ ఓచర్ అందచేస్తారు. అంతే మొత్తానికి బంగారం, విలువైన ఆభరణాలు కొన్న కస్టర్లకు రూ.1,000 గిఫ్ట్ ఓచర్ అందిస్తారు. రూ.15,000 అంతకన్నా పైబడిన విలువ గల వెండి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి రూ.500 గిఫ్ట్ ఓచర్ అందచేస్తారు.
జోస్ అలుక్కాస్ ‘‘సిగ్నేచర్ జువెలరీ షో’’
ఆభరణాల రిటైలింగ్‌లోని జోస్ అలుక్కాస్ కూకట్‌పల్లి షోరూమ్‌లో ‘‘సిగ్నేచర్ జువెలరీ షో’’ నిర్వహిస్తోంది. ఈ నెల 26 వరకు ఉండే ఈ షోలో ప్రపం చ స్థాయి వజ్రాలను ప్రదర్శిస్తారు. నటి ప్రియా పగ్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో నెక్లె్‌సలు, స్టేట్‌మెంట్ చెవిపోగులు, బైస్పోక్ వెడ్డింగ్ సెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సందర్భంగా వజ్రాల విలువపై 30ు వరకు తగ్గింపు ఇస్తున్నట్టు జోస్ అలుక్కాస్ ఎండీ పాల్ అలుక్కాస్ తెలిపారు. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంపిక చేసిన బంగారం, డైమండ్, ప్లాటినం ఆభరణాల మేకింగ్ చార్జీలపై 50ు తగ్గింపు ఇస్తున్నట్టు వెల్లడించారు. అలాగే 10ు సొమ్ము చెల్లించి తమకు నచ్చి న ఆభరణాన్ని బుక్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నట్టు చెప్పారు. బంగారం ఆభరణాల కొనుగోలుపై గ్రాము కు రూ.100 క్యాష్‌బాక్ కూడా అందిస్తున్నారన్నారు.
ఇవి కూడా చదవండి
రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు
చిన్నపిల్లల్లో జుట్టు తెల్లబడటానికి కారణాలు ఇవే