జోస్ అలుక్కాస్ దీపావళి ఆఫర్లు
ABN , Publish Date - Oct 28 , 2026 | 07:03 AM
ప్రముఖ స్వర్ణాభరణాల రిటైల్ విక్రయాల సంస్థ జోస్ అలుక్కాస్ దీపావళి ఆఫర్లను ప్రకటించింది.
హైదరాబాద్: ప్రముఖ స్వర్ణాభరణాల రిటైల్ విక్రయాల సంస్థ జోస్ అలుక్కాస్ దీపావళి ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లు ప్రత్యేక ఆభరణాల ఆఫర్లను పొందడంతోపాటు రూ.10 కోట్ల విలువైన ఆకర్షణీయమైన బహుమతులను సైతం గెలుచుకునే అవకాశాన్ని అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. పండుగ షాపింగ్ ప్రయోజనాలు, ప్రత్యేక బహుమతులు, ఆకర్షణీయమైన రివార్డులు ఈ నవంబరు 15 వరకు అందుబాటులో ఉంటాయని జోస్ అలుక్కాస్ వెల్లడించింది. దీపావళి ఆఫర్లలో భాగంగా బంగారం కొనుగోలుపై నిబంధనలు, షరతులకు లోబడి ఉచిత వెండిని పొందవచ్చు. అలాగే, కస్టమర్లు కియా సోనెట్ కార్లు, స్కూటర్లు, ఇతర బహుమతులను సైతం గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, బంగారం ఆభరణాల తయారీ చార్జీపై 30 శాతం వరకు, వజ్రాభరణాలు, ప్లాటినం ఆభరణాలపై 30 శాతం తగ్గింపును కల్పిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.