జియో షేర్ల లిస్టింగ్ నేడే..
ABN , Publish Date - Oct 28 , 2026 | 07:09 AM
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం, డిజిటల్ సేవల అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) తన షేర్లను బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదు చేయనుంది.
రెండో అత్యంత విలువైన కంపెనీగా అవతరించే అవకాశం
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం, డిజిటల్ సేవల అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) తన షేర్లను బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదు చేయనుంది. తొలి పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)లో జియో షేర్లకు లభించిన డిమాండ్‌ను బట్టి చూస్తే, లిస్టింగ్ రోజున కంపెనీ మార్కెట్ విలువ కనీసం రూ.12.61 లక్షల కోట్ల స్థాయికి ఎగబాకే అవకాశాలున్నాయి. తద్వారా జేపీఎల్.. టెలికాం సేవల్లో తన ప్రధాన ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్‌ను మూడో స్థానానికి నెట్టి, రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత రెండో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించే అవకాశాలున్నాయి. కాగా, గత శుక్రవారంతో ముగిసిన జియో ఐపీఓకు 22.19 రెట్ల సబ్‌స్క్రిప్షన్ లభించింది.