జపాన్‌లోనూ వడ్డీ రేట్లు పెరిగాయ్
ABN , Publish Date - Sep 19 , 2026 | 02:50 AM
జపాన్‌లోనూ వడ్డీ రేట్ల పెరుగుదల ప్రారంభమైంది. కీలక వడ్డీ రేటును ప్రస్తుత 1 శాతం నుంచి 1.25 శాతానికి పెంచుతున్నట్టు జపాన్ కేంద్ర బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ జపాన్ (బీఓజే) ప్రకటించింది.
టోక్యో: జపాన్‌లోనూ వడ్డీ రేట్ల పెరుగుదల ప్రారంభమైంది. కీలక వడ్డీ రేటును ప్రస్తుత 1 శాతం నుంచి 1.25 శాతానికి పెంచుతున్నట్టు జపాన్ కేంద్ర బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ జపాన్ (బీఓజే) ప్రకటించింది. గత 31 సంవత్సరాల్లో జపాన్‌లో వడ్డీ రేట్లు ఇంత గరిష్ఠ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిడి, అమెరికా, ఈయూ దేశాల కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లు పెంచడంతో బీఓజే ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.