Share News

1.7 కోట్లకు పైగా ఐటీఆర్‌ల దాఖలు

ABN , Publish Date - Jul 12 , 2026 | 03:46 AM

త ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఆర్జించిన ఆదాయానికి సంబంధించి ఐటీఆర్‌ 1, 2లను దాఖలు చేయాల్సిన గడువు సమీపిస్తోంది. ఈ గడువు ఈ నెల 31 వ తేదీతో...

1.7 కోట్లకు పైగా ఐటీఆర్‌ల దాఖలు

  • ఐటీ శాఖ వెల్లడి

  • ఈ నెల 31 వరకు గడువు

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఆర్జించిన ఆదాయానికి సంబంధించి ఐటీఆర్‌ 1, 2లను దాఖలు చేయాల్సిన గడువు సమీపిస్తోంది. ఈ గడువు ఈ నెల 31 వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 1.7 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు 2026-27 అసె్‌సమెంట్‌ సంవత్సరానికి సంబంధించి తమ ఐటీఆర్‌లను దాఖలు చేసినట్టు ఆదాయ పన్ను శాఖ శనివారం ‘ఎక్స్‌’లో వెల్లడించింది. ఇందులో ఒక్క శుక్రవారం నాడే 10 లక్షలకు పైగా రిటర్నులు దాఖలైనట్టు పేర్కొంది.

ఐటీఆర్‌ 1 (సహజ్‌).. చిన్న, మధ్య స్థాయి పన్ను చెల్లింపుదారులకు అత్యంత సులువైన ఫారం. పన్ను చెల్లింపుదారుల వార్షిక ఆదాయం రూ.50 లక్షల లోపు ఉండాలి. జీతం ఆదాయం, ఒక గృహ ఆస్తి, రూ.5,000 వరకు వ్యవసాయ ఆదాయం వచ్చే వారు సహజ్‌ను దాఖలు చేయాలి. ఇక ఐటీఆర్‌-2ను వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే లాభాలు కాకుండా మూలధన లాభాల ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు దాఖలు చేయాలి.

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ బులెట్ ట్రైన్స్ హబ్‌గా మారబోతోంది: అశ్వినీ వైష్ణవ్

ఐదు గనులకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

Updated Date - Jul 12 , 2026 | 03:46 AM