హైదరాబాద్‌లో ఐసాల్వ్‌డ్ కార్యాలయం
ABN , Publish Date - May 20 , 2026 | 05:33 AM
అమెరికాకు చెందిన హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (హెచ్‌సీఎం) సొల్యూషన్స్ కంపెనీ ఐసాల్వ్‌డ్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమెరికాకు చెందిన హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (హెచ్‌సీఎం) సొల్యూషన్స్ కంపెనీ ఐసాల్వ్‌డ్ తన కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. గచ్చిబౌలిలో 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ తమ టెక్నాలజీ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని సంస్థ ఇండియా జనరల్ మేనేజర్ యోగేష్ మోరే అన్నారు. ఈ సెంటర్‌లో త్వరలోనే ఉద్యోగుల సంఖ్య 300కు చేరుకుంటుందని, వచ్చే ఏడాదిలో ఈ సంఖ్యను 400కు పెంచుకుంటామని మోరే చెప్పారు.
ఇవి కూడా చదవండి..
గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన
పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..