బీమా రంగానికీ ‘యుద్ధ’ సెగ
ABN , Publish Date - May 28 , 2026 | 02:56 AM
పశ్చిమాసియా యుద్ధంపై దేశీయ బీమా పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ యుద్ధానికి వెంటనే తెరపడకపోతే, ఆ ప్రభావం దేశీయ బీమా పరిశ్రమ వృద్ధి రేటు ను దెబ్బతీసే ప్రమాదం ఉందని...
వృద్ధి రేటు తగ్గే అవకాశం
ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ దొరైస్వామి
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధంపై దేశీయ బీమా పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ యుద్ధానికి వెంటనే తెరపడకపోతే, ఆ ప్రభావం దేశీయ బీమా పరిశ్రమ వృద్ధి రేటు ను దెబ్బతీసే ప్రమాదం ఉందని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) సీఈఓ, ఎండీ ఆర్ దొరైస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధ ప్రభావం ప్రజల ఆదాయాలను దెబ్బతీస్తుందన్నారు. ఇప్పటి వరకు ఈ యుద్ధం పూర్తి ప్రభావం ప్రజలపై పెద్దగా పడకుండా ప్రభుత్వం చాలా వరకు అడ్డుకుందన్నారు. ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మాత్రం ప్రజల ఖర్చులు, పొదుపు కూడా దెబ్బతింటుందని దొరైస్వామి స్పష్టం చేశారు. అదే జరిగితే ఆ ప్రభావం నుంచి బీమా రంగం కూడా తప్పించుకోలేదన్నారు.
రూ.10,000 కోట్ల ఓఎఫ్ఎస్ ఇష్యూ!
మరోవైపు ఎల్‌ఐసీ ఈక్విటీలో తనకు ఉన్న 96.5 శాతం వాటాలో 2 శాతం షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) ద్వారా విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ నెలాఖరు లేదా జూలై ప్రారంభంలో ఈ ఇష్యూ ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ ఓఎ్‌ఫఎస్ ద్వారా ప్రభుత్వానికి రూ.10,000 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2022 మే నెలలో ప్రభుత్వం ఎల్‌ఐసీ ఈక్విటీలో 3.5 శాతం వాటాను ఐపీఓ ద్వారా విక్రయించి రూ.21,000 కోట్లు సమీకరించింది. భారత పబ్లిక్ ఇష్యూ చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద ఐపీఓ.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి.