Share News

Infosys Q3 Results: ఇన్ఫీ లాభం రూ. 6,654 కోట్లు

ABN , Publish Date - Jan 15 , 2026 | 06:33 AM

వర్తమాన ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 2.2ు తగ్గి రూ.6,654 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో...

Infosys Q3 Results: ఇన్ఫీ లాభం రూ. 6,654 కోట్లు

క్యూ3లో 2.2% తగ్గుదల.. కొత్త లేబర్‌ కోడ్‌ అమలు ప్రఽభావం

న్యూఢిల్లీ: వర్తమాన ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 2.2ు తగ్గి రూ.6,654 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.6,806 కోట్లుగా నమోదైంది. ఈ క్యూ3లో ఇన్ఫోసిస్‌ ఆదాయం 8.89ు వృద్ధితో రూ.45,479 కోట్లకు చేరుకుంది. 2024-25లో ఇదే కాలానికి రాబడి రూ.41,764 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే, క్యూ3లో సంస్థ లాభం 9.6ు తగ్గగా.. ఆదాయం 2.2ు పెరిగింది.

  • కొత్త కార్మిక చట్టాల అమలులో భాగంగా సిబ్బందికి గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ బకాయిల చెల్లింపుల కోసం క్యు3లో రూ.1,289 కోట్లు కేటాయించడం ఇన్ఫోసిస్‌ లాభంపై ప్రభావం చూపింది.

  • ఈ ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫీ ఆదాయ వృద్ధి అంచనా మెరుగైంది. స్థిర కరెన్సీ ఆధారిత ఆదాయ వృద్ధి అంచనాను కంపెనీ గతంలో ప్రకటించిన 2-3ు నుంచి 3-3.5 శాతానికి పెంచింది. నిర్వహణ లాభాల మార్జిన్‌ను 20-22 శాతంగా అంచనా వేసింది.

  • గడిచిన మూడు నెలల్లో ఇన్ఫోసిస్‌ 480 కోట్ల డాలర్ల విలువైన బడా కాంట్రాక్టులను దక్కించుకుంది. అందులో 57 శాతం కొత్తవే. బడా డీల్స్‌ ఈ క్యూ1లో 380 కోట్ల డాలర్లుగా, క్యూ2లో 310 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.

  • గడిచిన త్రైమాసికంలో కంపెనీ రూ.18,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌తో పాటు మధ్యంతర డివిడెండ్‌ చెల్లింపులను కూడా విజయవంతంగా పూర్తి చేసింది.

  • 2025 డిసెంబరు 31తో ముగిసిన మూడు నెలల్లో కంపె నీ ఉద్యోగుల సంఖ్య నికరంగా 5,043 పెరుగుదలతో 3,37,034కు చేరుకుంది.


డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ బలమైన పనితీరు కనబరిచింది. నైపుణ్యం, ఆవిష్కరణల సామర్థ్యాలు, బలమైన డెలివరీ యోగ్యతను ప్రదర్శిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) భాగస్వామిగా ఇన్ఫోసి్‌సను క్లయింట్లు చూస్తున్నారు. ఇది వారి వ్యాపార సామర్థ్యం, విలువను పెంచుకునేందుకు దోహదపడింది. ఏఐ ప్రపంచంలో విజయ సాఽధించేందుకు మా సిబ్బంది పరివర్తనం, సాధికారత కోసం నైపుణ్య శిక్షణలో కంపెనీ నిబద్ధత ఈ ప్రయాణంలో ప్రధానంగా మారింది.

సలీల్‌ పరేఖ్‌, ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ

ఇవి కూడా చదవండి..

చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 15 , 2026 | 06:33 AM