Share News

ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి

ABN , Publish Date - Feb 17 , 2026 | 05:26 AM

ఎగుమతుల రంగం జనవరిలో స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది జనవరితో పోల్చితే ఎగుమతులు 0.61% పెరిగి 3,656 కోట్ల డాలర్లకు (రూ.3.33 లక్షల కోట్లు) చేరాయి. దిగుమతులు...

ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి

న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం జనవరిలో స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది జనవరితో పోల్చితే ఎగుమతులు 0.61% పెరిగి 3,656 కోట్ల డాలర్లకు (రూ.3.33 లక్షల కోట్లు) చేరాయి. దిగుమతులు 19.2% వృద్ధితో 7,124 కోట్ల డాలర్లుగా (రూ.6.48 లక్షల కోట్లు) నమోదయ్యాయి. వాణిజ్య లోటు 3,468 కోట్ల డాలర్లుగా (రూ.3.16 లక్షల కోట్లు) నిలిచింది. వస్తు, సేవల ఎగుమతులు జనవరిలో వృద్ధి పథంలోనే ఉన్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ అన్నారు. ఈ ఏడాది ఎగుమతులు 86 వేల కోట్ల డాలర్ల (రూ.78.26 లక్షల కోట్లు) స్థాయిని దాటవచ్చని ఆయన అంచనా వేశారు. కాగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-జనవరి నెలల మధ్య కాలంలో ఎగుమతులు 2.22ు పెరిగి 36,663 కోట్ల డాలర్లకు (రూ.33.37 లక్షల కోట్లు) చేరినట్టు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి..

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 17 , 2026 | 05:26 AM