RBI Report,: మొండి బాకీలు మరింత తగ్గేను
ABN , Publish Date - Jan 01 , 2026 | 04:34 AM
దేశీయ బ్యాంకింగ్ రంగంలో మొండి బాకీలు మరింత తగ్గనున్నాయని ఆర్‌బీఐ అంటోంది. 2027 మార్చి నాటికి బ్యాంక్‌ల మొండి బాకీల...
2027 మార్చి నాటికి ఎన్‌పీఏలు
1.9 శాతానికి పరిమితం: ఆర్‌బీఐ
ముంబై: దేశీయ బ్యాంకింగ్ రంగంలో మొండి బాకీలు మరింత తగ్గనున్నాయని ఆర్‌బీఐ అంటోంది. 2027 మార్చి నాటికి బ్యాంక్‌ల మొండి బాకీల నిష్పత్తి సాధారణ పరిస్థితుల్లో 1.9 శాతానికి జారుకోవచ్చని అంచనా వేసింది. అధ్వాన్న పరిస్థితుల్లో మాత్రం ఎన్‌పీఏలు మళ్లీ 3.2-4.2 శాతానికి ఎగబాకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బుధవారం విడుదల చేసిన అర్ధ వార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఆర్‌బీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. 2025 సెప్టెంబరు నాటికి ఎన్‌పీఏలు దశాబ్దాల కనిష్ఠ స్థాయి 2.1 శాతానికి తగ్గాయి. రుణదాతలకు రూ.4 లక్షల కోట్ల రికవరీ
కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియల ద్వారా 2025 సెప్టెంబరు చివరినాటికి రుణదాతలు రూ.4 లక్షల కోట్ల బకాయిలను రికవరీ చేసుకోగలిగారని ఆ నివేదిక.
స్టేబుల్ కాయిన్స్‌తో ముప్పే..: స్టేబుల్ కాయిన్స్ సహా క్రిప్టో కరెన్సీలు భారత ద్రవ్య సార్వభౌమత్వానికి, ఆర్థిక స్థిరత్వానికి ముప్పుగా పరిణమించవచ్చని ఆర్‌బీఐ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. వాటి విలువలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం ఇందుకు కారణంగా పేర్కొంది.
ఇవి కూడా చదవండి
మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి